Constable Attacked Woman : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కోవూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. దళిత వాడలో ఉంటున్న షేకున్ అనే మహిళపై కానిస్టేబుల్ సురేశ్ దాడికి దిగాడు. పదునైన కత్తితో గొంతు కోశాడు. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తన భార్య ఆత్మహత్య చేసుకోవడానికి షేకున్ కారణమనే అనుమానంతో కానిస్టేబుల్ సురేశ్ ఆమెపై దాడి చేశాడని తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటన గురించి ఆరా తీస్తున్నారు. సంఘటన గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.