Concrete mixer lorry : కాంక్రీట్‌ మిక్సర్‌ లారీ బీభత్సం.. ఒక ట్రాక్టర్, రెండు బైక్ లను ఢీకొనడంతో నలుగురు మృత్యువాత

మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాంక్రీట్‌ మిక్సర్‌ లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తోన్న ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

Concrete mixer lorry : కాంక్రీట్‌ మిక్సర్‌ లారీ బీభత్సం.. ఒక ట్రాక్టర్, రెండు బైక్ లను ఢీకొనడంతో నలుగురు మృత్యువాత
Road Accident 4 Died

Updated on: Jun 19, 2021 | 12:03 AM

Concrete mixer lorry crash : మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాంక్రీట్‌ మిక్సర్‌ లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తోన్న ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్‌ వద్ద ఈ ఘోరం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాంక్రీట్‌ మిక్సర్‌ రెండు ద్విచక్రవాహనాలను, ఒక ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనాలపై ఉన్న ముగ్గురు, ట్రాక్టర్‌పై ఉన్న మరొకరు మృతి చెందారు.

మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన అవనిగడ్డ వాసులైన తండ్రీ కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read also :  ecalcus app : ఉచిత ఆన్ లైన్ టీచింగ్ యాప్ ‘ఇకాల్కస్’ ను ఆవిష్కరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి