పంజాబ్‌లోని లూథియానా జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చెలరేగింది. కొంతమంది ఖైదీలు జైలునుంచి పారిపోయేందుకు పక్కా ప్లాన్ వేసి.. ఘర్షణలు రేపారు. అయితే గొడవ జరుగుతుండగా.. కొందరు ఖైదీలు పారిపోయేందుకు యత్నించారు. వీరిని గమనంచిని పోలీసులు ఆ ఖైదీలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఘర్షణలు పెద్ద ఎత్తున జరగడంతో ఖైదీలను అడ్డుకోవడం అక్కడి పోలీసులకు సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో అల్లర్లు చేస్తున్న ఖైదీలపై లాఠీఛార్జ్ చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేదుకు కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘర్షణల్లో పది మందికి పైగా గాయాలపాలయ్యారని.. వీరిలో ఖైదీలతో పాటుగా పలువరు పోలీసులకు కూడా గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జైలులో మొత్తం రెండు వేలమంది ఖైదీలు ఉన్నారని.. అయితే వీరిలో కేవలం నలుగురు మాత్రమే పారిపోయేందుకు యత్నించారని వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఉన్నతాధికారులు తెలిపారు.