
కొడుకు కోరిన కాలేజీలో సీటు ఇప్పించేందుకు గానూ చైనాకు చెందిన ఓ మహిళా కాలేజీ యాజమాన్యానికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడి పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా..జడ్ఢి ఆమెకు రూ.2.5 లక్షల డాలర్ల(రూ. కోటి 89 లక్షలు) జరిమానా విధించారు. ఇంతకీ అది ఏ కాలేజీలోనో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాజ్ ఏంజిల్స్( యూసీఎల్ఏ)లో తన కొడుకుకు అడ్మిషన్ కోసం ప్రయత్నించింది చైనాకు చెందిన సుయ్ జియోనింగ్ అనే మహిళ. అందుకోసం 4 లక్షల డాలర్ల (రూ. 3 కోట్ల 2 లక్షలు) లంచం ఇచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆమెపై కేసు నమోదైంది. అయితే, ఈ సంఘటన 2019లో చోటు చేసుకుంది. అప్పుడే ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. కెనాడాలో నివసిస్తున్న సదరు మహిళను 2019 సెప్టెంబర్‌లోనే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఐదు నెలలపాటు స్పెయిన్‌లోనే ఆమె జైలు శిక్ష అనుభవించింది.
కాగా, ఫిబ్రవరిలో సుయ్ జియోనింగ్‌ని కోర్టులో హాజరుపర్చగా..జడ్జీ తీర్పును వాయిదా వేశారు. తాజా విచారణలో తన క్లైంట్ చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతోందని సుయ్ తరపు న్యాయవాది జడ్జితో తెలిపారు. కాగా, లంచం కేసులో ఆమె అరెస్ట్ అయినందుకు గానూ జడ్జీ ఆమెకు భారీ జరిమానా విధించారు. సుయ్ కోర్టుకు 2.5 లక్షల డాలర్ల(రూ. కోటి 89 లక్షలు) జరిమానా చెల్లించాలన్నారు. అయితే, ప్రస్తుత కరోనా నేపథ్యంలో జూమ్ యాప్ ద్వారా జడ్జి తీర్పునివ్వడం గమనార్హం.