స్వీట్స్ తిని 12 మంది చిన్నారులకు అస్వస్థత

|

Oct 03, 2020 | 11:50 AM

నోరు తిపిచేసే తియ్యని స్వీట్లు చిన్నారుల పట్ల విషంగా మారాయి. తూర్పుగోదావరి జిల్లాలో 12 మంది చిన్నారులు స్వీట్స్ తిని అస్వస్థతకు గురికావడం తీవ్ర కలకలం రేపింది.

స్వీట్స్ తిని 12 మంది చిన్నారులకు అస్వస్థత
Follow us on

నోరు తిపిచేసే తియ్యని స్వీట్లు చిన్నారుల పట్ల విషంగా మారాయి. తూర్పుగోదావరి జిల్లాలో 12 మంది చిన్నారులు స్వీట్స్ తిని అస్వస్థతకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లాలోని వీఆర్‌పురం మండలం, పొలుసుమామిడి గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

సమీప దుకాణంలో కొనుగోలు చేసిన రస గుల్లాలు తిన్న 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో ఓ ఇంటికి చుట్టపుచూపుగా వచ్చిన వక్తి ఇచ్చిన తినుబండారాలను తిన్న చిన్నారులు వాంతులు, విరోచనాలు చేసుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దీంతో హుటాహుటిన 108 అంబులెన్స్‌లో వీఆర్‌పురం ప్రభుత్వ ఆస్పత్రికి చిన్నారులను తరలించారు. అందులో ఐదేళ్ల బాలిక పరిస్థితి విషమంగా మారడంతో భద్రాచలం ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. కాగా, చిన్నారులందరూ సురక్షితంగా ఉన్నారని, భద్రాచలం రిఫర్ చేసిన చిన్నారి కూడా క్షేమంగా ఉన్నట్లు డిప్యూటీ డీఎం.హెచ్.ఓ పద్మజ వెల్లడించారు. పిల్లలు తిన్న రసగుల్లాల ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.