Chhattisgarh Maoist: మావోయిస్టులు మరో ఎత్తుగడతో ముందుకు సాగుతున్నారు. ఛత్తీస్‌గడ్ ఘాతుకం తర్వాత మరో ప్లాన్‌తో అడుగులు వేస్తున్నారు. ఛత్తీస్‌గడ్ ఘటన తర్వాత తొలిసారి ఓ లేఖను విడుదల చేశారు. అందులో భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. సీపీఐ మావోయిస్టు సౌత్ సబ్ జోనల్ బ్యూరో పేరుతో లేఖను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.
ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 25 వరకు అన్ని ప్రజా ఉద్యమాలకు మద్దతుగా విప్లవాత్మక ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్లు లేఖలో వెల్లడిచారు. ఏప్రిల్ 26న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. వెంటనే ఆపరేషన్ ప్రహార్-3ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రహార్ ఆపరేషన్‌లో పాల్గొనవద్దని నక్సల్స్ పారా మిలటరీ, ఛత్తీస్‌గడ్ పోలీసులు, జవాన్లకు లేఖలో కోరారు.
పోలీస్ ఉద్యోగం మానేయాలని.. సమదాన్- ప్రమార్ ను ఓడించే ప్రజల ఉద్యమంలో చేరి తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని లేఖలో వెల్లడించారు. అంతే కాదు గ్రామాల్లో పోలీసులు ప్రజలను వేధింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఇలాంటి పలు డిమాండ్లతో కూడా ఓ భారీ లెటర్‌ను మావోయిస్టులు మీడియాకు విడుదల చేశారు.