Maoist kills in Dantewada Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్‌ఘడ్ దంతేవాడ జిల్లా ఎన్‌కౌంటర్ లో 5 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు మృతిచెందారు. చింద్నార్, పహుర్నార్ అటవీప్రాంతంలో DRG పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పులలో రూ.5 లక్షల రివార్డు ఉన్న మావోయిస్ట్ ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి.
మృతి చెందిన మావోయిస్ట్ రాంసు అని 16 ప్లాటూన్ సెక్షన్ కమాండర్ గార్డ్ గా గుర్తించారు. ఇతనిపై 5 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు, ఘటన స్థలం నుండి 7.62mm పిస్టల్, 5 కేజీల ఐ ఈడీ, 2 వాకీ టాకీలు,మావోయిస్టుల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసు బలగాలు. ఘటనను దృవీకరించిన దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్.