టెకీ దారుణం.. భార్యా, పిల్లల్ని చంపి ఆత్మహత్య.. ఆన్‌లైన్‌లో రంపం, కత్తి కొనుగోలు చేసి మరీ..

పోలీసులు వచ్చి ఇంటిని తనిఖీ చేయగా ఇంట్లో రక్తపు మడుగులో భార్య, ఇద్దరు పిల్లలు కనిపించారు. ప్రకాశ్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు.

టెకీ దారుణం.. భార్యా, పిల్లల్ని చంపి ఆత్మహత్య.. ఆన్‌లైన్‌లో రంపం, కత్తి కొనుగోలు చేసి మరీ..
Chennai Murder

Updated on: May 28, 2022 | 12:33 PM

Techie Suicide after Murder wife and kids: చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఐటీ ఉద్యోగి భార్య, ఇద్దరు పిల్లల్ని దారుణంగా నరికి చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. వారిని హత్య చేసేందుకు టేకీ.. ఆన్లైన్‌లో కత్తి, రంపం ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. ఈ ఘటన చెన్నై నగరంలో సంచలనం రేపింది. ఈ దారుణ ఘటన చెన్నైలోని పల్లవరంలో శనివారం జరిగింది. ప్రకాష్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పల్లవరంలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి ఇంట్లో నుంచి ఎవరూ.. బయటికి రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఇంటిని తనిఖీ చేయగా ఇంట్లో రక్తపు మడుగులో భార్య, ఇద్దరు పిల్లలు కనిపించారు. ప్రకాశ్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యా, పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రకాష్ సూసైడ్ లెటర్ రాశాడు. స్థానికుల నుంచి పలు వివరాలను సేకరించిన పోలీసులు.. నాలుగు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

కాగా.. ప్రకాశ్ భార్యా పిల్లలను హత్య చేసేందుకు ఆన్లైన్‌లో రంపం, కత్తిని కొనుగోలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నై పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేశారనే కోణంలో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..