చెన్నైలో దారుణం…ఫ్లెక్సీ మీదపడి టెకీ మృతి

| Edited By:

Sep 13, 2019 | 1:10 PM

చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. రాజకీయ నేతల అత్యుత్సాహం, పార్టీ కార్యకర్తల వీరాభిమానం ఓ నిండుప్రాణాన్ని బలిగొంది. చెన్నైలో దురైపాక్కంలో ఉన్న ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శుభశ్రీ (22) అనే యువతి గురువారం తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా మ‌ృత్యువు మింగేసింది. శుభశ్రీ తన ద్విచక్రవాహనంపై పల్లకరణి మొయిన్ రోడ్డుపై వెళ్తుండగా రోడ్డు డివైడర్‌పై అప్పటికే కట్టిన అధికార అన్నాడిఎంకే పార్టికి చెందిన ఓ మాజీ కౌన్సిలర్ ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకకు […]

చెన్నైలో దారుణం...ఫ్లెక్సీ మీదపడి టెకీ మృతి
Follow us on

చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. రాజకీయ నేతల అత్యుత్సాహం, పార్టీ కార్యకర్తల వీరాభిమానం ఓ నిండుప్రాణాన్ని బలిగొంది. చెన్నైలో దురైపాక్కంలో ఉన్న ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శుభశ్రీ (22) అనే యువతి గురువారం తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా మ‌ృత్యువు మింగేసింది.

శుభశ్రీ తన ద్విచక్రవాహనంపై పల్లకరణి మొయిన్ రోడ్డుపై వెళ్తుండగా రోడ్డు డివైడర్‌పై అప్పటికే కట్టిన అధికార అన్నాడిఎంకే పార్టికి చెందిన ఓ మాజీ కౌన్సిలర్ ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకకు ఆహ్వానం పలికే ఫ్లెక్సీ ఆమె ముందు పడిపోయింది. దీంతో ఆమె దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడిపోయింది. అయితే అదే సమయలో వెనుకనుంచి వచ్చిన వాటర్ ట్యాంకర్ లారీ ఆమెను ఢీకొట్టడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన స్ధానికులు వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టుగా ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాటర్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

రహదారులకు ఇరువైపులా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టకూడదంటూ మద్రాస్ హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జరీ చేసినా వివిధ రాజకీయ పార్టీల నేతలు, వివిధ వర్గాలకుచెందిన వారు యధేచ్ఛగా బ్యానర్లు కడుతూనే ఉన్నారు. చెన్నైలో జరిగిన తాజ ఘటనపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. కోర్టు ఉత్తర్వులను పాటించకుండా బ్యానర్లు ఏర్పాటు చేసిన అన్నా డీఎంకే నేతతో పాటు, వాటిని కట్టిన కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటపై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమంటూ విమర్శించారు. ఇకపై తమ డీఎంకే పార్టీకి చెందిన నేతలెవరూ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టవద్దని, ఒకవేళ ఏర్పాటు చేసినా వాటికి పర్మిషన్ తీసుకోవాలని పార్టీ నేతలకు దేశించారు స్టాలిన్.