Cheddi Gangs: ఏపీలో దడ పుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్స్.. నగర శివారులే టార్గెట్.. అడ్డొస్తే అంతే..

|

Dec 07, 2021 | 3:18 PM

ఆంధ్రప్రదేశ్‌లో చెడ్డీ గ్యాంగ్స్‌ దడ పుట్టిస్తోన్నాయి. వారిని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. ఇన్నాళ్లు హైదరాబాద్‌లో మాత్రమే కనిపించిన ఈ చెడ్డీ గ్యాంగ్స్...

Cheddi Gangs: ఏపీలో దడ పుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్స్.. నగర శివారులే టార్గెట్.. అడ్డొస్తే అంతే..
Cheddi Gang
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో చెడ్డీ గ్యాంగ్స్‌ దడ పుట్టిస్తోన్నాయి. వారిని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. ఇన్నాళ్లు హైదరాబాద్‌లో మాత్రమే కనిపించిన ఈ చెడ్డీ గ్యాంగ్స్… ఇప్పుడు ఏపీలో వరుస చోరీలకు పాల్పడటంతో కలకల రేగుతోంది. అసలు ఈ చెడ్డీ గ్యాంగ్స్ ఎలా చోరీలకు పాల్పడతాయ్? ఎలా తప్పించుకుంటాయి? భూతద్దం పెట్టి వెదికినా పోలీసులకు ఎందుకు దొరకడం లేదు?

చిక్కడు-దొరకడు అన్నట్టు ఉంటుంది ఈ చెడ్డీ గ్యాంగ్‌ చోరీస్ స్టైల్‌. సీసీటీవీ ఫుటేజ్‌లో మాత్రమే కనిపిస్తారు… కానీ, దొరకరు. అంతా గాఢ నిద్రలో ఉండగా.. అర్ధరాత్రి రెండు తర్వాతే దొంగతనాలు చేస్తారు. శివార్లలోని విల్లాలు, బంగ్లాలు, అపార్ట్‌మెంట్లనే చోరీలు చేయడానికి ఎంచుకుంటారు. ముందుగా పక్కాగా రెక్కీ నిర్వహించి… ఆపై యాక్షన్ ప్లాన్ అమలు చేస్తారు. చెడ్డీ గ్యాంగ్‌లో ఉన్నోళ్లంతా నాన్‌ లోకల్సే అయినా, స్థానికులకు ఉన్నట్లు అన్ని ఏరియాలపై పట్టు ఉంటుంది.

చెడ్డీ గ్యాంగ్‌లో కనీసం పది మంది వరకు ఉంటారు. తప్పించుకునే వ్యూహాన్ని ముందే సిద్ధంచేసుకుని ప్లాన్‌ను అమలు చేస్తారు. ఒంటిపై చెడ్డీ, తలపాగా మాత్రమే ధరిస్తారు. మారణాయుధాలతో చోరీలకు వస్తారు. వాళ్ల ముందు ఎలాంటి తాళమైనా బలదూరే. సింగిల్‌ రాడ్‌తో చిటికెలో తాళం తెరుస్తారు. అడ్డొస్తే అంతం చేయడానికైనా వెనుకాడరు. ఇదీ చెడ్డీ గ్యాంగ్ స్టైల్‌.

బెజవాడలో రెండుచోట్ల ఈ చెడ్డీ గ్యాంగ్స్ బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా చిట్టినగర్‌, గుంటుపల్లిలో హైఫై అపార్ట్‌మెంట్స్‌లో చోరీకి విఫలయత్నం చేశాయి. ఆ తర్వాత సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కి సమీపంలోని తాడేపల్లిలో అలజడి సృష్టించాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, టీటీడీ ఛైర్మన్‌, ప్రముఖులు నివాసముండే రెయిన్‌బో విల్లాస్‌లోనే చోరీలకు పాల్పడ్డాయి.

బెజవాడ, తాడేపల్లే కాదు… పులివెందుల నుంచి గుండుగొలను వరకు ఈ చెడ్డీ గ్యాంగ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అనంతపురం, కడప, పశ్చిమగోదావరి, చిత్తూరు, విశాఖ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒంగోలులో జరిగిన రెండు డబుల్‌ మర్డర్స్‌ కూడా చెడ్డీ గ్యాంగ్స్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read Also.. Hyderabad: సహోద్యోగికి లైంగిక వేధింపులు.. జీహెచ్ఎంసీలో కలకలం.. విచారణకు మేయర్ ఆదేశం