టీడీపీ నేత యరపతినేనిపై కేసు నమోదు

| Edited By: Pardhasaradhi Peri

Aug 03, 2019 | 6:00 PM

గురజాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో పిడుగురాళ్లకు చెందిన గురవాచారి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ఆదేశాలతో యరపతినేనితో పాటు మరో 12 మందిపై సత్తెనపల్లి డీఎస్పీ శనివారం కేసు నమోదు చేశారు. అక్రమ మైనింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తనపైనే దాడి చేశారని గురవాచారి కోర్టును ఆశ్రయించారు. అక్రమ మైనింగ్‌ విషయంలో 2014లోనే ఫిర్యాదు చేశానని.. యరపతినేనికి అప్పటి మైనింగ్‌ శాఖ అధికారులు, […]

టీడీపీ నేత యరపతినేనిపై కేసు నమోదు
Follow us on

గురజాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో పిడుగురాళ్లకు చెందిన గురవాచారి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ఆదేశాలతో యరపతినేనితో పాటు మరో 12 మందిపై సత్తెనపల్లి డీఎస్పీ శనివారం కేసు నమోదు చేశారు. అక్రమ మైనింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తనపైనే దాడి చేశారని గురవాచారి కోర్టును ఆశ్రయించారు. అక్రమ మైనింగ్‌ విషయంలో 2014లోనే ఫిర్యాదు చేశానని.. యరపతినేనికి అప్పటి మైనింగ్‌ శాఖ అధికారులు, పోలీసులు సహకరించారని గురవాచారి ఆరోపించారు.