Car Crashed into a Crop Canal: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆత్రేయపురం మండలం లొలాకుల వద్ద కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కాల్వలో ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి.ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు.
పాలకోడేరు మండలం గొల్లల కోడేరుకు చెందిన ముందిటి సురేష్ వర్మ, చింతలపాటి శ్రీనివాస్‌రాజు, ఇందుకూరి వెంకటసత్యనారాయణరాజు, ముదునూరి వెంకటగణపతిరాజు, మున్నింటి సీతారామరాజులు ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటారు. మహా శివరాత్రి సందర్భంగా బంధువులు ఇంటికి శివరాత్రి వేడుకలకు వచ్చారు.
వీరంతా ఈ తెల్లవారుజామున తిరిగి కారులో వెళ్తుండగా లొల్లాకుల మలుపు వద్దకు వచ్చేసరికి మంచు కారణంగా కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది.
వీరిలో వెంకటగణపతిరాజు, సీతారామరాజు సురక్షితంగా బయటపడగా.. మిగిలిన ముగ్గురు కాలువలో గల్లంతయ్యారు. సురేష్ వర్మ, శ్రీనివాస్‌రాజు, సత్యనారాయణరాజుల మృతదేహాలు బయటకు తీశారు.