Bus Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నదిలో పడ్డ బస్సు.. ముగ్గురు మృతి, 28మందికి గాయాలు

|

Jan 02, 2022 | 11:23 AM

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.

Bus Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నదిలో పడ్డ బస్సు.. ముగ్గురు మృతి, 28మందికి గాయాలు
Bus Accident
Follow us on

Madhya Pradesh Bus Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. అలీరాజ్‌పూర్ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అలీరాజ్‌పూర్‌లోని ఖాండ్వా బరోడా రహదారిపై ఆదివారం ఉదయం వేగంగా వెళ్తున్న ప్యాసింజర్ బస్సు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 28 మంది గాయపడగా, వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సు గుజరాత్‌లోని భుజ్‌ నుంచి బర్వానీకి వెళ్తోంది. ఈ ఘటన ఖాండ్వా బరోడా రాష్ట్ర రహదారిపై జరిగిందని సహాయకచర్యలు కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో 7 మంది చిన్నారులు కూడా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం వైద్యులు అతన్ని ఇండోర్‌ ఆసుపత్రికి రెఫర్ చేశారు. బస్సు కల్వర్టు రెయిలింగ్ 15 అడుగుల దిగువన నదిలో పడిపోయిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు అలీరాజ్‌పూర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అదే సమయంలో ప్రమాదం జరిగినప్పటి నుంచి బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలోనే పట్టుకుంటామని అలీరాజ్‌పూర్ ఎస్పీ మనోజ్ సింగ్ తెలిపారు. స్థానిక బస్సులో ఫిట్‌నెస్ సర్టిఫికేట్. రిజిస్ట్రేషన్ తనిఖీ చేసి కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. కాగా, ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధితులకు పరిపాలనకు రూ. ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.


Read Also…. Karachi Bakery: మిఠాయి పాడైందని అధికారులకు నెటిజన్ ఫిర్యాదు.. హైదరాబాద్ కరాచీ బేకరీకి రూ.10 వేల జరిమానా!