Btech Student Suicide: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సర్ సి ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణా జిల్లాకు చెందిన తిరుమలేష్ తీవ్ర ఒత్తిడి, మనస్తాపానికి గురై సెల్ఫీ వీడియో తీసుకుని కాలేజ్ భవనంపై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన విద్యార్థులు, కాలేజ్ యాజమాన్యం హుటాహుటిన విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ తిరుమలేష్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్య గల కారణాలను ఆరా తీస్తున్నారు. కాగా పెనుగంచిప్రోలుకు చెందిన వడ్డెల్లి గోపాలరావు, తులసి దంపతులకు తిరుమలేశ్ ఒక్కగానొక్క సంతానం. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో తల్లి ఉపాధ్యాయురాలిగా, తండ్రి బోధనేతర సిబ్బందిగా పనిచేస్తూ కుమారుడిని అల్లారుముద్దుగా పెంచారు. లాక్‌డౌన్ సమయంలో ఇంటికొచ్చి సంతోషంగా గడిపిన తిరుమలేశ్ కళాశాలకు వెళ్లిన నాలుగు రోజులకే ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగారు.
ఇమ్యూనిటీ పెరగాలంటే ఇవి తప్పనిసరిగా తినాల్సిందే.. వీటితో కంటికి కనిపించని వైరస్ ఖతం..
బీటెక్, డిగ్రీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఐబీఎం, టాస్క్ మధ్య కీలక ఒప్పందం..