Anantapur Murder: సమయం రాత్రి 8గంటలు.. నగరం నడిబొడ్డున అందరూ చూస్తుండగా.. ఒక వ్యక్తిని తరముకుంటూ వచ్చిన సుమారు 50మంది యువకులు.. రాడ్లు, కర్రలతో దాడి… ఈ ఘటనలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి ప్రాణాలు (Brutal Murder) వదిలాడు. ఇదీ అనంతపురం నగరంలో జరిగిన దారుణ సంఘటన. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోండి.. (Anantapur) నగరంలోని నీరుగంటి వీధికి చెందిన ప్రసాద్ సోదరుడు ఇవాళ జాతర కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10గంటల సమయంలో ఇన్నోవా వాహనంలో వస్తుండగా.. భవానీ నగర్ కు చెందిన ముగ్గరు యువకులు ఒకే బైక్ పై వచ్చి ఇన్నోవాకు తగిలారు. దీంతో ప్రసాద్ వారిని మందలించాడు. మమ్మల్నే వేలు పెట్టిచూపిస్తావా అంటూ దాడికి యత్నించారు. అక్కడ అంతా సర్దిచెప్పి పంపారు. మళ్లీ సాయంత్రం వచ్చి గొడవపడేందుకు ప్రయత్నించారు.. కానీ ఒక పెద్ద మనిషి రాజీ చేసి పంపారు.
అయితే.. రాత్రి 8గంటల సమయంలో ప్రసాద్ వస్తుండగా.. సుమారు 50మంది యువకులు రాడ్లు, కర్రలతో వెంబడించారు. రక్షించండంటూ.. వేగంగా పరుగులు తీశాడు. కానీ వారు 50మంది చుట్టు ముట్టి కృష్ణ థియేటర్ సమీపంలో దాడి చేశారు. అందరూ చూస్తుండగానే ఈ దాడి జరిగింది. కాసేపటి తరువాత గాయపడ్డ ప్రసాద్ ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
మృతుడు ప్రసాద్ కు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భవానీ నగర్‌కు చెందిన కొందరు వ్యక్తులు తరచూ ఇలా గొడవలు పడటం.. గ్యాంగ్ లుగా వచ్చి దాడులు చేయడం పరిపాటిగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు.
Also Read: