RGV : ఆర్జీవీకి తెలంగాణ హైకోర్టులో బ్రేకు.! దిశ ఎన్ కౌంటర్ సినిమా విడుదలను 2 వారాలు ఆపాలని ఆదేశం

వివాదాస్పద దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మకు ఇవాళ షాక్ తగిలింది. తెలంగాణ లోనే కాదు, యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార ఘటన, ఆపై ఎన్ కౌంటర్ ను ఆధారంగా..

RGV : ఆర్జీవీకి తెలంగాణ హైకోర్టులో బ్రేకు.! దిశ ఎన్ కౌంటర్ సినిమా విడుదలను 2 వారాలు ఆపాలని ఆదేశం
RGV

Updated on: Jun 14, 2021 | 10:40 PM

Disha Encounter movie : వివాదాస్పద దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మకు ఇవాళ షాక్ తగిలింది. తెలంగాణ లోనే కాదు, యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార ఘటన, ఆపై ఎన్ కౌంటర్ ను ఆధారంగా చేసుకుని వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను ఆపాలని దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇవాళ దిశ తండ్రి అప్పీలుపై హైకోర్టు విచారణ జరిపింది.

అయితే, ఈ సినిమాకు దర్శక, నిర్మాతలు తామేనని ఆనంద్ చంద్ర, అనురాగ్ న్యాయస్థానానికి తెలిపారు. సినిమా టైటిల్ ‘ఆశ ఎన్ కౌంటర్’ గా మార్చినట్లు దర్శక నిర్మాతలు కోర్టుకు విన్నవించారు. అంతేకాదు, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏప్రిల్ 16న ‘ఏ సర్టిఫికెట్’ ఇచ్చిందని, సెన్సార్ సర్టిఫికెట్ ను సవాల్ చేసేందుకు వీలుగా వారం రోజులు విడుదల ఆపుతామని దర్శక, నిర్మాతలు కోర్టుకు తెలిపారు.

ఇరువురి వాదనలు విన్న కోర్టు సినిమా విడుదలను రెండు వారాలు ఆపాలని ఆదేశించింది. దిశ తండ్రి అప్పీలుపై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి ఈ సందర్బంగా ప్రకటించారు.

Read also : Govt. Lands sale : ప్రభుత్వ ఆస్తులు అమ్మమని.. త్వరగా పూర్తి చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్రం లేఖ రాసింది : హరీశ్ రావు

Loading...
Unable to load recommendations.
Follow Us