మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు గోదావరి నది మునిగిపోయారు. కోటపల్లి ఎర్రాయిపేటలో సోమవారం ఈఘటన జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ళతో ఆ యువకుల కోసం గాలిస్తున్నారు. కానీ ఇంతవరకు ఆ యువకులకు జాడ కనపడలేదు. నదిలో గల్లంతయిన యువకులు చెన్నూరు పట్టణానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.