Hyderabad Woman Murder: హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. ఐదు రోజులుగా కనిపించకుండాపోయిన మహిళ శవమై తేలింది.. శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ దారుణ హత్య అలస్యంగా వెలుగు చూసింది.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే రాజమణి(48) అనే మహిళ ఐదు రోజు క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరగి రాలేదు. దీంతో కుుటంబసభ్యులు వివిధ ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదిలావుండగా, శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్‌పేట ప్రాంతంలో రాజమణి మృతదేహాం అనవాళ్లు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని వెలికి తీశారు. సాంకేతిక ఆధారలతో ఎంక్వేరి చేసిన పోలీసులు.. రాజమణి మృతదేహన్ని ఆమె ప్రియుడు అశోక్ పాతిపెట్టినట్లు నిర్ధారించారు.
అయితే, హైదరాబాద్ మహానగర శివారులోని జవహర్ నగర్ ప్రాంతంలో నివాసముండే అశోక్‌తో రాజమణి గత పది సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఇటీవల మరో వ్యక్తితో ఆమె, చనువుగా ఉండటంతో.. ఇద్దరు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సొంత ప్రియుడు అశోక్ ఆమెను హత్య చేసిన్నట్టు పోలీసులు తేల్చారు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా ఆమె మృతదేహన్ని.. శామీర్‌పేట్ ప్రాంతంలోని చెట్ల పొదల్లో భూమిలో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, రాజమణి మృతదేహన్ని శామీర్ పేట్ తహశీల్దార్ సమక్షంలో బయటతీసిన పోలీసులు.. పంచనామా చేసి, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి అశోక్‌నై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also… Underwater Wedding: అడ్వెంచర్ సెంటర్‌లో నీటిలో పెళ్లి చేసుకుని ఒక్కటైన జంట.. వీడియో వైరల్..
Udan Scheme: ఉడాన్ పథకంలో భాగంగా ఐదు కొత్త విమానాశ్రయాల ఏర్పాటు.. ఎక్కడెక్కడ అంటే..