ఊయలే ఉరితాడుగా మారింది

కళ్ల ముందు ఆడుకుంటున్న బాలుడు కానరాని లోకాలకు పోయాడు. ఊయలలో ఆడుకుంటున్న బాలుడికి ఆ ఊయలే ఉరితాడైంది. కృష్ణా జిల్లాలో చోటుచేసుకున్న ఘటన ఆ తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది.

ఊయలే ఉరితాడుగా మారింది
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 07, 2020 | 2:47 PM

కళ్ల ముందు ఆడుకుంటున్న బాలుడు కానరాని లోకాలకు పోయాడు. ఊయలలో ఆడుకుంటున్న బాలుడికి ఆ ఊయలే ఉరితాడైంది. కృష్ణా జిల్లాలో చోటుచేసుకున్న ఘటన ఆ తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది.

కోడూరులోని జయపురం ఎస్సీవాడ చెందిన మద్దాల వెంకటేశ్వర్‌రావు, నాగరాణి దంపతులకు కార్తీక్‌(6), మూడేళ్ల కూతురు ఉన్నారు. వీరు గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో పనిచేసుకుంటూ నివాసముంటున్నారు. ఇటీవల కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి తమ సొంత గ్రామమైన జయపురానికి వచ్చారు. అయితే, సోమవారం కార్తీక్‌ తన చెల్లెతో కలిసి పక్కింట్లో ఆడుకునేందుకు వెళ్లాడు. అక్కడ చీరతో కట్టి ఉన్న ఊయలలో కార్తీక్ ఆడుకుంటుండగా చీర మెడకు చుట్టుకుంది. అది ఎంతకీ వదలక పోవడంతో కంగారుపడిన బాలుడు వదిలించుకునే ప్రయత్నం చేశాడు. అదీ మరిన్ని మెలికలు తిరుగుతూ బిగుసుకుపోయి చీర ఉచ్చులా మారింది. దీంతో ఒక్కసారి ఉపిరిడాక ఉక్కిరిబిక్కిరయ్యాడు బాలుడు. అక్కడే ఉన్న బాలుడి చెల్లెలు ఇది గమనించి కేకలు వేయడంతో ఇరుపొరుగు వారు వచ్చి కార్తీక్‌ను ఊయల నుంచి కిందకు దింపారు. కానీ అప్పటికే బాలుడి ప్రాణాలు గాలిలో కలిశాయి. కళ్లముందు ఆడుకుంటున్న కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. తండ్రి వెంకటేశ్వర్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!