కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలాకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని మహారాష్ట్ర సర్కర్‌ను బాంబే హైకోర్టు ఆదే ఆదేశించింది. భద్రతకు సంబంధించి ఆయనకు ఉన్న అన్ని సందేహాలను తొలిగించాలని సూచించింది. పూనావాలాకు Z+ కేటగిరి భద్రత కల్పించాలని కోరుతూ దత్తా మానే దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ అభయ్ అహుజాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ నిర్వహించింది. పూణేకు చెందిన పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘వై’ కేటగిరీ భద్రతను మంజూరు చేసింది.
కోవిషీల్డ్ డోసుల కేటాయింపుపై SII సీఈవోకు పలువురి నుంచి తీవ్ర ఒత్తిడి, బెదిరింపులు వచ్చినట్లుగా పిటిషనర్ పేర్కొన్నాడు. దీంతో పూనవల్లా భయంతో జీవిస్తున్నారని కోర్టుకు పిటిషనర్ కోర్టు విన్నవించుకున్నారు. ఇలాంటి బెదిరింపుల కారణంగా పూనవల్లా లండన్ బయలుదేరినట్లు మానే విజ్ఞప్తి చేశారు.దీనిపై ధర్మాసనం స్పందిస్తూ… యాంటీ-కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను తయారు చేయడం ద్వారా పూనవల్లా దేశానికి గొప్ప సేవ చేస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యనించింది. ఇటీవలే లండన్‌కు వెళ్లిన పూనవల్లాతో రాష్ట్ర ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా మాట్లాడాలని తెలిపింది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అతని భద్రత గురించి భరోసా ఇవ్వాలని పేర్కొంది.