కొకైన్ తరలిస్తూ పట్టుబడిన బీజేపీ మహిళా నేత.. అరెస్ట్ చేసిన కోల్‌కతా పోలీసులు..

|

Feb 20, 2021 | 2:24 AM

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి చెందిన యువ మహిళా నాయకురాలిని కోల్‌కతా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌ బీజేపీ యువ నాయకురాలైన..

కొకైన్ తరలిస్తూ పట్టుబడిన బీజేపీ మహిళా నేత.. అరెస్ట్ చేసిన కోల్‌కతా పోలీసులు..
Follow us on

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి చెందిన యువ మహిళా నాయకురాలిని కోల్‌కతా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌ బీజేపీ యువ నాయకురాలైన పమేలా గోస్వామి తన కారులో కొకైన్ తరలిస్తుండగా.. న్యూ అలీపూర్ ప్రాంతంలో పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పమేలా గోస్వామితోపాటు ఆమె స్నేహితుడు ప్రోబిర్ కుమార్ డేను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

పమేలా ప్రయాణిస్తున్న కారు ఒక నిర్థిష్ట ప్రాంతంలో ఆగుతుందని వచ్చిన సమాచారం మేరకు.. న్యూ అలీపూర్ ప్రాంతంలోని ఎన్‌ఆర్ ఎవెన్యూ వద్ద ఆమె కారును తనిఖీ చేసినట్లు పోలీసులు తెలిపారు. కారులో ఉన్న బ్యాగులో నిషేధిత నార్కోటిక్స్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ సమయంలో ఆమె కారులో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

Also Read:

Toolkit Case: మరో మూడు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి దిశ రవి..

ఫేస్‌బుక్ ఇష్యూపై ప్రధానమంత్రి మోదీతో చర్చించా.. ఆస్ట్రేలియా పీఎం మారిసన్ వెల్లడి