ఝార్ఖండ్‌లో పట్టపగలే దారుణం జరిగింది. ఓ బీజేపీ నాయకుడిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే తుపాకీతో కాల్చిచంపారు. అందరు చూస్తుండగానే సినీపక్కీలో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. దన్‌బాద్‌లోని బాక్‌మోర్ ప్రాంతంలో భారతీయ జనతాపార్టీ నగర ఉపాధ్యక్షుడు సతీశ్ సింగ్ కారు దిగి సెల్ ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తుండగా.. ముఖానికి మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అయన్ను అనుసరించారు. తిరిగి చూసేలోగానే సమీపం నుంచి తలపై తుపాకీతో కాల్చి పరారయ్యారు. సతీశ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ రామ్‌కుమార్ తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన మృతుడి సన్నిహితుడు, స్థానిక ఎమ్మెల్యే రాజ్ సిన్హా ఇది రాజకీయ హత్యేనని ఆరోపించారు.
भाजपा (BJP) नेता के सीधे सिर में मारी गोली…विधायक राज सिन्हा के करीबी की हत्या…BJP leader murdered in Dhanbad…परी खबर https://t.co/Q14120E4I1 पर पढ़ें. Jharkhand News https://t.co/5K8tCBFvY5 pic.twitter.com/f8Gq4zgiR3
— Jharkhand Junction (@jh_junction) August 19, 2020