Bank Employees Fraud: భద్రాద్రి కోపరేటివ్ బ్యాంకులో ఇంటి దొంగలు.. పోలీసుల విచారణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు..!

|

Sep 01, 2021 | 12:20 PM

నమ్మి దాచుకున్న సొమ్ముకే ఎగనాం పెట్టారు. కంచె చేను మేసిందన్న చంధంగా మారింది. తాజా కొందరు బ్యాంక్ ఉద్యోగుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Bank Employees Fraud: భద్రాద్రి కోపరేటివ్ బ్యాంకులో ఇంటి దొంగలు.. పోలీసుల విచారణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు..!
Bhadradri Co Operative Bank Copy
Follow us on

Bhadradri co operative Bank Employees Fraud: నమ్మి దాచుకున్న సొమ్ముకే ఎగనాం పెట్టారు. కంచె చేను మేసిందన్న చంధంగా మారింది. కొందరు బ్యాంక్ ఉద్యోగులు మరీ బరితెగిస్తున్నారు. టైమ్ టూ టైమ్ భారీగా జీతాలు వస్తున్నా కూడా ..అక్రమ సొమ్ము కోసం తప్పుడు మార్గాలను అన్వేశిస్తున్నారు. ఇప్పటికే అనేకచోట్ల నకిలీ లోన్లు, స్వయం చేతివాటాలు, ఫేక్ చోరీలు సంఘటనలు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మరో కొత్త పద్దతిలో నిధుల స్వాహా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి కో ఆపరేటివ్ అర్బన్​బ్యాంకు​లిమిటెడ్ బ్రాంచ్‍లో పనిచేస్తున్న ఉద్యోగులే చేతివాటం ప్రదర్శించారు. ఏకంగా రూ.1.86 కోట్లు మాయం చేశారు.

ఆగస్టు నెల ఆడిట్‌తో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లెక్కల్లో భారీగా తేడాలు రావడంతో బ్యాంకు యాజమాన్యం మణుగూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్యాంకు మేనేజర్‍‌తో సహా అసిస్టెంట్​మేనేజర్‍, క్యాషియర్‍, అటెండర్‍ ఈ తతంగం నడిపినట్లు బ్యాంక్ ఉన్నతాధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం​చేశారు. మణుగూరు ఏఎస్పీ శబరీశ్​ఇందుకోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బ్యాంకు మేనేజర్‍, అసిస్టెంట్​మేనేజర్​ఫోన్లు స్విచాఫ్​చేసి పరారీలో ఉన్నారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

మణుగూరులోని భద్రాద్రి కోఆపరేటివ్​ అర్బన్​ బ్యాంకు టర్నోవర్ రూ.150 కోట్లు. ఇండస్ట్రియల్ ​ఏరియా కావడంతో బార్​షాపులు, గోల్డ్ షాపుల యజమానులు, ఆయిల్​బంకుల ఓనర్లు ప్రతిరోజు సాయంత్రం బ్యాంకుకు డబ్బుతో వస్తారు. ఆ టైంలో ఆన్‍లైన్ పనిచేయడం లేదంటూ.. తర్వాతి రోజు పొద్దున్నే జమ చేస్తామని బ్యాంకు సిబ్బంది నమ్మకంగా చెప్పేవారు. అలా కొన్నిరోజులుగా డబ్బును మరుసటిరోజున జమ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకు మేనేజర్‍, అసిస్టెంట్​మేనేజర్లు ఒకరోజు డబ్బును దారి మళ్లించి బయట వారికి వడ్డీకి ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం కాస్త బ్యాంక్ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో మొత్తం లెక్కలను ఆడిట్ చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఈ క్రమంలో ఆగస్టు నెల ఆడిట్‌తో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సమయానికి డబ్బు రొటేషన్​కాకపోవడంతో ఆగస్టు నెలకు సంబంధించి రూ.1.86కోట్లకు లెక్కలు తేలలేదు. ఆడిట్​రిపోర్టు బ్యాంకు యాజమాన్యానికి వెళ్లడంతో పోలీసులకు కంప్లైంట్​చేసింది. ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో తెలుసుకుని డబ్బు చెల్లించేందుకు బ్యాంక్​మేనేజ్​మెంట్​ఒప్పుకుంది. ఇప్పటివరకు బ్యాంకులో డిపాజిట్లు చేసినవారు, బంగారం తనఖా పెట్టినవారు ఆందోళన చెందుతున్నారు. బ్యాంక్​ఉద్యోగుల ఫ్రాడ్​పై దర్యాప్తు చేస్తున్నామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని మణుగూరు పోలీసులు తెలిపారు.