Cyber Crime: అమ్మాయే సన్నగా అరనవ్వు నవ్వితే…ఇది పాట కాదు. నిలువుదోపిడికి కొత్త బాట. ఖాళీ ఫోన్ కాల్‌తో లక్షలకు లక్షలు నిలువుదోపిడి జరిగిపోతుంది మరి .పెద్దలకు మాత్రమే అనే హద్దును చెరిపేసిన డేటింగ్ యాప్ డర్టీ కల్చర్ ఇప్పుడు పల్లెబాటలో డేంజర్ బెల్స్‌మోగిస్తోంది. వీడియో కాల్ వచ్చిందంటే మగానుభావుల వెన్నులో వణుకు. ఎందుకంటే….అదో రకం మంట. హాస్కీ వాయిస్.. గమ్మత్తు గారడీ…అంకుల్సే టార్గెట్‌గా బ్యూటీ బాంబ్స్ సర్జికల్ స్ట్రయిక్స్ జోరందుకున్నాయి. కాల్ లిఫ్ట్ చేస్తే గమ్మత్తు మాటలకు గుండె జారీ గల్లంతవడమే. మ్యాటర్ అర్ధమవుతోందా?.. స్మార్ట్‌ఫోన్ యుగంలో ఇస్మార్ట్ లవ్వాయనంలో బ్లాక్‌మెయిలింగ్ యవ్వారం ఇది. రాండమ్‌గా కాల్ చేస్తారు. లిఫ్ట్ చేయగానే చెవిలో తేనే పూసినంత తీయ్యగా హాస్కీ వాయిస్‌తో మెస్మరైజ్ చేస్తారు. మీ ఫోటో చూసి పడిపోయా…. వారెవా మీ సొగసు చూడతరమా.. నిద్ర పట్టల్లేదు ..ఇలా డైలాగులతో డైలామాలో పడేస్తారు. ఫోటోలు..టాటూలు..లింకులు.. నగదు బట్వాడా అవన్నీ ఔట్ డేటెడ్. ఇప్పుడంతా ఆన్‌లైన్‌లో నగ్నంగా నిలువుదోపిడే. వీడియో కాల్ అటెండయితే చాలు.. స్వర్గం ఇక్కడే వుందంటూ నూలుపోగులేకుండా న్యూడ్‌గా మారిపోతారు. దొరకునా ఇటువంటి భాగ్యమని టెంప్టయితే .. ఇక అంతే సంగతులు. ఎందుకంటే ఇటుసైడు చొంగకార్చుకున్న శాల్తీ పప్పీ షేమ్ వీడియో సదరు కిలాడీ రికార్డ్ చేసేస్తుంది. ఆ తరువాత బెదిరింపు చాటింగ్.. బ్లాక్‌మెయిలింగ్ కాల్స్ జోరందుకుంటాయి. అడిగినప్పుడల్లా అడిగినంత డబ్బు ఇవ్వాల్సిందే. లేదంటే ఇజ్జత్ కా సవాల్. కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు వీడియోను పంపిస్తా.. పప్పీషేమ్ వీడియోను సోషల్ మీడియో పోస్ట్ చేస్తా అని బ్లాక్‌మెయిలింగ్ చేస్తారు.
అదీ సంగతి. అన్‌నోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా లేకపోయినా..టికెట్ లేకుండా ఫ్రీ సినిమా చూసే చాన్స్ దొరికిందని చంకలు గుద్దుకున్నాచివరకు జరిగేది అనర్ధం. మిగిలేది అవమానం. డేటింగ్ యాప్స్ జోలికి వెళ్లొద్దు. అన్ నోన్ కాల్స్‌ను అటెండ్ కావద్దు..కుప్పలు తెప్పలుగా వచ్చే A మార్క్ లింకులను టచ్ చేయోద్దని సైబర్ క్రైమ్ పోలీసులు చెవిలో జోరిలాగా చెప్తున్నారు. అవగాహన కల్పిస్తున్నారు. ఐనా సరే కొందరు చొంగకార్చే యవ్వారంతో బ్యూటీ బాంబ్స్ వలలో పడిపోతున్నారు.
ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యక్తికి అనుకోకుండా ఓ మిస్‌తో పరిచయమైంది. అదీ మిస్డ్ కాల్‌తో. కాల్ చేస్తే ..స్వీట్ వాయిస్.. గురుడు ఫ్లాట్.. పరిచయం చాటింగ్‌కు.. చాటింగ్ వీడియో కాల్ వరకు వెళ్లింది. ఆ తరువాత ఇక చెప్పేదేముంది?..మనోడి పప్పీషేమ్ చిత్రమ్ అటు చేరింది. పైసా వసూల్ పర్వం పట్టాలెక్కింది. సిట్యుయేషన్ ఎలా మారిందంటే పగోడికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దని ఫీలయ్యేంతగా. న్యూడ్ వీడియో కాల్స్ ముసుగులో చివరకు లాయర్లు చిక్కకోవడంతో ఒక్కసారిగా విషయం బయటకు వచ్చింది. న్యాయవాదులకు న్యూడ్ కాల్ తో వలపు వల విసరడమే కాకుండా ఢిల్లీ పోలీసులమంటూ బెదిరింపు కాల్స్ సైతం వచ్చినట్టుగా తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.
నిజామాబాద్‌లో కూడా న్యూడ్ కాల్ బాగోతాలు ఓ రేంజ్‌లో రికార్డవుతున్నాయి.ఎల్లారెడ్డికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగిని ఇద్దరు మహిళలు బాగా వాడేసుకున్నారు. ముందు కూతురు ఫోన్ చేసిందట. ఆ తరువాత ఆమె తల్లి లైన్‌లోకి వచ్చారట. ఆన్ అండ్ ఆఫ్ ఫార్మూలా ఫాలో అవుతూ తల్లీకూతురు ఇద్దరు సదరు శాల్తీని న్యూడ్ కాల్స్‌తో బాగా ఊరించారు. మ్యాటరంతా రికార్డ్ చేశారు. డబ్బిస్తావా.. ఇజ్జత్ తీయాలా అంటూ బెదిరింపులకు దిగి దఫదఫాలుగా లకారంలో డబ్బులు దండుకున్నారు. ఇక కామారెడ్డి పట్టం కాకతీయనగర్‌లో ఓ పొలిటికల్ లీడర్‌కూ న్యూడ్ వీడియోలకు టెంప్టయి చాలానే డబ్బు సమర్పించుకున్నాడనే టాక్ లోకల్‌గా పీక్స్‌కు వెళ్లింది. తేలు కుట్టినా కుట్టన్నట్టు బాధితులు సైలెంట్‌గా వుండడమే బ్లాక్‌మెయిలర్స్‌కు ఊతమవుతోంది.
మరిన్ని నేర వార్తల కోసం చూడండి.