హైదరాబాద్‌లో అమ్మాయిలపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడొక చోట మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతుండటంతో అమ్మాయిలను బయటికి ఒంటరిగా పంపించాలంటేనే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ సైన్స్ ల్యాబ్‌లో అత్యాచారానికి పాల్పడిన ఘటన మరువక ముందే తాజాగా ఓ ఆటోడ్రైవర్ హిజ్రాపై అఘాయిత్యానికి యత్నించిన ఘటన కలకలం రేపుతోంది.
కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ ఆటోడ్రైవర్ హిజ్రాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాచుపల్లికి చెందిన మహేష్ అనే ఆటోడ్రైవర్ మంగళవారం రాత్రి తన ఆటో ఎక్కిన ఓ ట్రాన్స్‌జెండర్‌పై లైంగిక దాడి చేయడానికి యత్నించాడు. ఎలాగోలా ఈ కామాంధుడి బారి నుంచి తప్పించుకుని ఆ బాధితురాలు మిగిలిన హిజ్రాలకు అసలు విషయాన్ని చెప్పింది. దీంతో రెచ్చిపోయిన హిజ్రాలు మహేష్‌ను చితకబాది.. బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి ఆ మృగాడిని అరెస్ట్ చేశారు.