
ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన నూతన వదూవరులు దర్మరణం చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతులు కేరళకు చెందిర టీ మాథ్యూస్, నిను సుసెన్ ఏల్దోగా తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఈ దంపతులు కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వారు బయటకు రావడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో అగ్నికి ఆహుతయ్యారు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం శుక్రవారం వేకువజామున 6 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మాథ్యాస్ వయసు 30 కాగా, ఏల్దో వయసు 28 ఏళ్లు.