Crime News: మేనత్తతో ప్రేమాయణం… గర్భవతిని చేసిన వైనం.. ఆపై ఊహించని విషాదం

ఈ మధ్య కాలంలో బంధాలు మరీ దారుణంగా తయారయ్యాయి. కొందరు వావి వరసలు కూడా పట్టించుకోవడం లేదు. వ్యామోహంతో తప్పులు చేస్తున్నారు. విషయం....

Crime News: మేనత్తతో ప్రేమాయణం... గర్భవతిని చేసిన వైనం.. ఆపై ఊహించని విషాదం
Pregnant

Updated on: Aug 30, 2021 | 9:31 PM

ఈ మధ్య కాలంలో బంధాలు మరీ దారుణంగా తయారయ్యాయి. కొందరు వావి వరసలు కూడా పట్టించుకోవడం లేదు. వ్యామోహంతో తప్పులు చేస్తున్నారు. విషయం బయటకు పొక్కితే ఏం చెయ్యాలో తెలియక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా 19 ఏళ్ల ఓ యువకుడు మేనత్త వరసయ్యే మరో యువతితో ప్రేమ పేరుతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి అయ్యింది. దీంతో వీరి వ్యవహారం పెద్దలకు తెలిసిపోయింది. ఇద్దర్నీ పద్దతి మార్చుకోమని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. అయినా కానీ వారు వినలేదు.. తమకు పెళ్లి చెయ్యాలని కోరారు. అందుకు పెద్దలతో ససేమేరా అనడంతో ఆ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లాలో వెలుగు చూసింది.

వీళ్లిద్దరికి నచ్చ జెప్పేందుకు కుటుంబ సభ్యులు శక్తికి మించి ప్రయత్నించారు. అమ్మాయి పేరెంట్స్.. యువకుడిని ఇంటికి పిలిపిచ్చి మరీ మాట్లాడారు. ఇలాంటి బంధాలను సమాజం ఒప్పుకోదని, ఎవరి దారి వాళ్లు చూసుకుంటే మంచిదని నయానో, భయానో చెప్పి చూశారు. అయినా వారు వినలేదు. యువతి కాస్త మెతకబడినా.. యువకుడు మాత్రం ఆమెనే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పాడు. దీంతో విసుగెత్తిన యువతి తల్లిదండ్రులు.. కుర్రాడిని తిట్టి పంపేశారు. అక్కడి నుంచి తన ఇంటికి బయలుదేరిన ఆ యువకుడు.. తన ఇంటికెళ్లలేదు. అర్థరాత్రి మరోసారి అమ్మాయి ఇంటికెళ్లాడు. బయటకొచ్చిన యువతి అతనితో ఎస్కేప్ అయ్యింది. పెద్దల్ని ఎదిరించి ఎలాగూ కలిసి జీవించలేము అనుకున్నారో మరో కారణమో కానీ వారు తమ జీవితాలను ఎండ్ చెయ్యాలనే కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. వంతెన పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వారి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. యువతీ యువకుల మృతితో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.

Also Read:  ‘లింకులు తెంపుతాం.. నేరస్థులను పట్టుకుంటాం..’ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు

కోటి ఆశలతో ప్రయాణాలు.. కాటికి చేరిన వైనాలు.. కాళ్ల పారాణి ఆరకముందే నవవధువులను బలి తీసుకుంటున్న ప్రమాదాలు

Loading...
Unable to load recommendations.
Follow Us