BoB: బ్యాంక్ స్ట్రాంగ్ రూంకే కన్నం వేశాడు.. రూ. 2 కోట్ల బంగారం మాయం చేశాడు.. బెట్టింగ్‌ కాశాడు.. చివరికి..

|

Sep 26, 2021 | 8:56 AM

అతను బ్యాంక్ అటెండర్. ఏకంగా బ్యాంక్ స్ట్రాంగ్ రూంకే కన్నం వేశాడు. అలస్యంగా బయటపడింది అతగాని బాగోతం. ఏకంగా 2 కోట్ల విలువైన బంగారం బయటపడింది. గుంటూరు జిల్లా బాపట్లలో సంచలనం సృష్టించిన బ్యాంక్ ఆఫ్ బరోడా...

BoB: బ్యాంక్ స్ట్రాంగ్ రూంకే కన్నం వేశాడు.. రూ. 2 కోట్ల బంగారం మాయం చేశాడు.. బెట్టింగ్‌ కాశాడు.. చివరికి..
Bob Chori
Follow us on

అతను బ్యాంక్ అటెండర్. ఏకంగా బ్యాంక్ స్ట్రాంగ్ రూంకే కన్నం వేశాడు. అలస్యంగా బయటపడింది అతగాని బాగోతం. ఏకంగా 2 కోట్ల విలువైన బంగారం బయటపడింది. గుంటూరు జిల్లా బాపట్లలో సంచలనం సృష్టించిన బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో వెలుగుచూసిన 2 కోట్ల 26 లక్షల రూపాయల విలువైన బంగారు నగల గల్లంతు కేసులో ప్రధాన నిందితుడు బ్యాంక్ అటెండర్ సుమంత్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను చేతివాటంతో విడతలవారీగా కైవసం చేసుకున్న అటెండర్ సుమంత్ రాజు కొంతకాలంగా బంగారు నగలను స్థానికంగా ఉన్న ప్రైవేట్ షాపుల్లో తాకట్టు పెట్టడం ప్రారంభించాడు. తన పేరుతో, స్నేహితుల పేర్లతో తాకట్టు పెట్టి 2 కోట్ల రూపాయల వరకూ సొమ్ము చేసుకున్నాడు.

ఆన్‌లైన్ రమ్మీ , బెట్టింగ్‌లలో చాలా సొమ్ము నష్టపోయి అప్పులు కూడా చేశాడు. నిందితుడు తాకట్టుపెట్టిన ప్రైవేట్ రుణ షాపుల్లో సంబంధిత ఖాతాలను సీజ్ చేసి నిందితుడు సుమంత్ రాజు సహా అతని స్నేహితులు అశోక్ కుమార్, కిషోర్ కుమార్ అనే కవలలను పోలీసులు అరెస్ట్ చేశారు.

వారి నుండి 2 కోట్ల 36 లక్షల రూపాయల విలువైన 6.18 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఇళ్లలో అణువణువు గాలించిన పోలీసులు.. బ్యాంక్‌లో దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:  AP Government: ఇక ఏపీలో అది కుదరదంటే.. కుదరదు.. కొత్త చట్టం తీసుకొచ్చే యోచనలో సర్కార్..

Elon Musk: ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు బ్రేకప్ చెప్పాడు.. 3 ఏళ్ల బంధం విడిపోవడానికి కారణం అదేనట..