Warangal District Atrocities: మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. రాను రాను అత్యంత క్రూరంగా మారుతున్నారు. తాజాగా వరంగల్ జల్లాలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శంగా నిలుస్తోంది. ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి, గొంతులో పదునైన ఆయుధంతో పొడిచి హతమార్చారు కిరాతకులు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
వరంగల్ జిల్లాలోని సంగెం మండలంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని తీగరాజుపల్లిలో హంస సంపత్ (50) అనే రైతును గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హతమార్చారు. సంపత్‌ను చెట్టుకు కట్టేసి కత్తితో గొంతులో పొడిచి చంపేశారు దుండగులు. ఈ దారుణానికి సంబంధించి గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నామని సంగెం పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.