Apartment fire accident : హైదరాబాద్ మహానగర శివారులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హుడా సాయి నగర్ రైడ్ నంబర్ 8లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని 5 వ ఫ్లోర్ సీలింగ్ ఫ్యాన్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది దీంతో ఒక్కసారి దట్టమైన పొగ అలుముకుని మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు అంటుకోవడం తో ఆ ఫ్లోర్ లో నిద్రలో ఉన్న ముగ్గురు అరుస్తూ బయటకు పరుగులు తీశారు.
కుటుంబసభ్యుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై స్థానికులు వనస్థలిపురం పోలీసులకి సమాచారం అందించడంతో.. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో 2 ఫైర్ ఇంజిన్‌లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకోవడం మంటలు ఇంకా మరో ఫ్లోర్‌లోకి వ్యాపించకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి… కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే శారదాంబ కన్నుమూత.. అనారోగ్యంతో బాధపడుతూ మృతి