
A Man Brutally Murdered in Vijayawada: విజయవాడ నగరంలోని దుర్గ అగ్రహారంలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దుండగులు కత్తులతో అత్యంత పాశవికంగా నరికి హతమార్చారు. హతుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ హఠాత్ పరిణామంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
రంగంలోకి దిగిన క్లూస్‌టీం హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. మృతుడిని కండ్రిగ ప్రాంతానికి చెందిన రామారావుగా గుర్తించారు. ఈ హత్యాకాండకు సంబంధించి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్యకు ఆర్థిక విభేదాలు లేదా వివాహేతర సంబంధం కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఒక్కసారిగా పట్టపగలు హత్యతో మరోసారి విజయవాడ ఉలికిపడింది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also…