Woman Abuse – Assaulted: అత్యాచారం చేసి.. ఇనుప రాడ్ చొప్పించి.. ముంబైలో మరో నిర్భయ ఘటన..!

|

Sep 10, 2021 | 7:47 PM

ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన మానవ మృగాలకు కట్టడి పడటంలేదు. దేశ వ్యాప్తంగా అత్యాచార ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.

Woman Abuse - Assaulted: అత్యాచారం చేసి.. ఇనుప రాడ్ చొప్పించి.. ముంబైలో మరో నిర్భయ ఘటన..!
Rape
Follow us on

Mumbai Woman Abuse – Assaulted: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన మానవ మృగాలకు కట్టడి పడటంలేదు. దేశ వ్యాప్తంగా అత్యాచార ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఒంటరిగా మహిళ రోడ్డుపైకి వెళ్లాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాలేజీలకు వెళ్లేందుకు విద్యార్థినిలు, ఇతర పనికి వెళ్లేందుకు మహిళలు, చిన్నారులకు సైతం ఎవరికీ రక్షణ లేకుండా పోతోంది. గడప దాటితే గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. అసలు ఒంటరిగా ఏంటి.. బంధువులు తెలిసిన వాళ్లతో కూడా మహిళ బయటకు వెళ్లాలంటేనే జడుసుకుంటున్నారు. ఆఖరికి భర్త, బంధువులతో కలిసి వెళ్తున్న మహిళలపైనా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మహిళల రక్షణ కోసమే ప్రభుత్వాలు.. నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలు తెచ్చినా ఫలితం లేకుండాపోతుంది. రోజు రోజుకూ అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆర్థిక రాజధాని ముంబై నిర్భయ లాంటి మరో ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై దుండగులు అతి దారుణం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు, శారీరకంగా చిత్రవధకు గురిచేశారు.

ముంబైలో సభ్య సమాజం తలదించుకునే మరో ఘటన జరిగింది. ఓ మహిళపై పాశవికంగా అఘాయిత్యానికి తెగబడిన దుండగులు ఆమె ప్రవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ముంబై మహానగరంలోని సకినాక ప్రాంతంలో జరిగిన ఈ ఘటన మరో ‘నిర్భయ’ను తలపించింది. 32 ఏళ్ల బాధిత మహిళపై దారుణానికి ఒడిగట్టిన ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

సకినాక ప్రాంతంలోని ఖైరాని రోడ్డులో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళను హుటాహుటీన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుర్తు తెలియని మహిళ రక్తపు మడుగులో పడి ఉందని తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో కంట్రోల్ రూముకు ఫోన్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు బాధిత మహిళను ఘట్కోపర్‌లోని రాజావాడి ఆసుపత్రికి తరలించామన్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. మరికొందరు నిందితుల కోసం ఆరా తీస్తున్నామన్నారు.

Read Also…  Social Mindfulness: ప్రపంచ దేశాల్లో సామాజిక బుద్ధి ప్రదర్శించడంలో భారత్ స్థానం తెలిస్తే షాక్ అవుతారు!