Groom Suicide: అల్లుని ఇంటికి వచ్చిన అత్తింటివారు.. ఆత్మహత్య చేసుకున్న నవ వరుడు.. అసలు విషయం తెలిస్తే షాక్!

ఇంట్లో తరచు గొడవలు జరుగుతున్నాయని, భార్యభర్తలిద్దరికి సర్ది చెప్పుదామని.. అల్లుని ఇంటికి వచ్చారు అత్తింటివాళ్లు. ఆ అల్లునికి ఏమనిపించిందో ఏమో.. ఆదరబాదరగా.. గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Groom Suicide: అల్లుని ఇంటికి వచ్చిన అత్తింటివారు.. ఆత్మహత్య చేసుకున్న నవ వరుడు.. అసలు విషయం తెలిస్తే షాక్!
Suicide
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 10, 2021 | 9:31 PM

Groom Suicide in Kamareddy District: ఇంట్లో తరచు గొడవలు జరుగుతున్నాయని, భార్యభర్తలిద్దరికి సర్ది చెప్పుదామని.. అల్లుని ఇంటికి వచ్చారు అత్తింటివాళ్లు. దీంతో ఆ అల్లునికి ఏమనిపించిందో ఏమో.. ఆదరబాదరగా.. గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు కొన ఊపిరితో ఉన్న ఆ యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

స్థానికులు, కుటుంబ సభ్యులు చెప్పిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. దేవునిపల్లి గ్రామనికి చెందిన మీసాల రఘువర్ధన్(25)కు బిక్కనూర్ మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన రవళితో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. కట్న కానుకలు ఇచ్చిన అత్తింటి వారు ఘనం పెళ్లి జరిపించారు. అయితే, గత కొద్దిరోజులుగా కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో కొద్దిరోజులుగా ఇంట్లో ఎవరికీ మనఃశాంతి లేకుండా పోయింది. అయితే, గురువారం అత్తింటివాళ్లు దేవునిపల్లికి వచ్చి భార్య, భర్తలకు నచ్చజెప్పుందుకు ప్రయత్నించారు. కాగా, కాసేపటికి అత్తింటివాళ్లు ఇంట్లో ఉండగానే గదిలోకి వెళ్లిన రఘువర్ధన్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ కలహాలే రఘువర్ధన్ ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. పెళ్లైన నాలుగు నెలలకే రఘువర్ధన్ అకాల మరణం ఆ కుటుంబాన్ని కలిచివేసింది. తన భర్త తనకళ్ల ముందే మృతి చెందడంతో ఆ ఇల్లాలి రోదన అందరిని కంటతడి పెట్టించింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also…  NIRF Rankings: టాప్‌10లో రెండో స్థానం సాధించిన జవహార్‌లాల్‌ నెహ్రూ వర్సిటీ.. తొమ్మిదో స్థానంలో హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ..