రూ.60 కోసం ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ హంగామా.. టోల్ గేట్ సిబ్బందిపై దేవళ్ల రేవతి దాడి..

| Edited By: Anil kumar poka

Dec 10, 2020 | 11:15 AM

గుంటూరు జిల్లాలో ఓ బాధ్యత కలిగిన మహిళ నాయకురాలు బారికేడ్లు తొలగిస్తూ హంగామా సృష్టించింది. అడ్డువచ్చిన వారిని చెంప పగులగొట్టింది. కారు సైరన్‌ మోగిస్తూ నానా బీభత్సం చేసింది.

రూ.60 కోసం ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ హంగామా.. టోల్ గేట్ సిబ్బందిపై దేవళ్ల రేవతి దాడి..
Follow us on

గుంటూరు జిల్లాలో ఓ బాధ్యత కలిగిన మహిళ నాయకురాలు బారికేడ్లు తొలగిస్తూ హంగామా సృష్టించింది. అడ్డువచ్చిన వారిని చెంప పగులగొట్టింది. కారు సైరన్‌ మోగిస్తూ నానా బీభత్సం చేసింది. గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్‌ దగ్గర ఏపీ వడ్డెర కార్పొరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌ దేవళ్ల రేవతి.. టోల్‌ ఫీజ్‌ కట్టకుండా వెళ్తోంది. దీంతో టోల్‌ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. టోల్‌ ఫీజ్‌ కట్టాల్సిందేనని రిక్వెస్టు చేశారు. అయితే, ఆమె వినలేదు. పైగా తననే టోల్‌ ఫీజు కట్టమంటారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, కారు దిగి రోడ్డుకు అడ్డంగా ఉన్న బారికేడ్లను తోసేసింది. అడ్డొచ్చిన సిబ్బందిపై చేయి చేసుకుంది. తన కారును ఆపితే.. మీ గతి ఏమవుతోందో చూడండి అంటూ వార్నింగ్‌ ఇచ్చింది. ఆమె విశ్వరూపం చూసిన టోల్‌ సిబ్బంది బెంబేలెత్తిపోయి పక్కకు తప్పుకున్నారు.

మొత్తానికి రూ.60 టోల్‌ ఫీజ్‌ కోసం అల్లరి అల్లరి చేసింది రేవతి. తన పరువు పోయేలా చేసుకుంది. ఒక్క ప్రజాప్రతినిధులు మినహా…నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న ఎవ్వరైనా సరే టోల్‌ ఫీజు కట్టాల్సిందే. ఎవ్వరికీ మినహాయింపు ఉంటుందో కూడా టోల్‌ సిబ్బందికి తెలుసు. ఐతే కార్పొరేషన్‌ ఛైర్మన్లు, ఇతర చోటా బడా నేతలు స్థానికంగా తమ పలుకుబడిని ఉపయోగించి టోల్‌ ఫీజు కట్టకుండా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని టోల్ గేట్ సిబ్బంది వాపోయారు. రేవతి చేసిన హంగామా అంతా అక్కడి సిబ్బంది సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అధికారి అయితే టోల్‌ ఫీజు కట్టకూడదా..అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.