యూపీలో దారుణం.. హోంవర్క్ చేయలేదని చిన్నారిపై మరిగే నూనె పోసిన ట్యూషన్ టీచర్.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. హోంవర్క్ చేయలేదన్న నెపంతో ఓ చిన్నారిపై మరిగుతున్న నూనె పోసింది ట్యూషన్ టీచర్. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

యూపీలో దారుణం.. హోంవర్క్ చేయలేదని చిన్నారిపై మరిగే నూనె పోసిన ట్యూషన్ టీచర్.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 10, 2020 | 12:10 PM

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. హోంవర్క్ చేయలేదన్న నెపంతో ఓ చిన్నారిపై మరిగుతున్న నూనె పోసింది ట్యూషన్ టీచర్. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గోరఖ్‌పూర్‌లోని మియాబజార్ ప్రాంతానికి చెందిన ఒక బాలిక లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడటంతో ఎదురింట్లో ఉంటున్న యువతి దగ్గర ట్యూషన్‌కి వెళ్తుంది. ఇదే క్రమంలో హోమ్‌వర్క్ చేయలేదని ఎదురింట్లో ఉంటున్న 16 ఏళ్ల యువతి, ఆమె తల్లి కలసి ఆ బాలికపై మరుగుతున్న నూనె పోశారు. ఈ ఘటనలో ఆ బాలిక చేతులతో పాటు శరీరంలోని కొంత భాగం కాలిపోయింది. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువతితోపాటు ఆమె తల్లిని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మియాబజార్ ప్రాంతానికి చెందిన మహిళకు ముగ్గురు కుమార్తెలు. ఈ ముగ్గురూ ఎదురింట్లో ఉంటే యువతి దగ్గర ట్యూషన్ చదువుతుంటారు. రోజూమాదిరిగానే మంగళవారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లారు. వారిలో ఐదేళ్ల బాలిక హోమ్‌వర్క్ చేయలేదు. ఈ విషయమై టీచర్ అడగగా, మరచిపోయానని ఆ బాలిక సమాధానం ఇచ్చింది. దీంతో ఆ టీచర్ మిగిలిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఇంటికి పంపించేసి, ఆ బాలికను మాత్రం తన దగ్గరే బలవంతంగా ఉండమంది. అదే సమయంలో ఆ యువతి తల్లి ఇంట్లో సమోసాలను నూనెలో వేయిస్తోంది. ఆ మరుగుతున్న నూనెను ఆ యువతితోపాటు ఆమె తల్లి ఆ బాలిక చేతులు, శరీరంపై కొన్ని భాగాల్లో పోశారు. దీంతో ఆ బాలిక ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. ఈ ఘటనపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.