AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

మహిళల రక్షణకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన కీచకులు రెచ్చిపోతూనే ఉన్నారు. నిత్యం దేశవ్యాప్తంగా ఏదో చోట అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కఠిన చట్టాలు తీసుకువస్తేనే గానీ ప్రయోజనం ఉండదని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు..  నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
Balaraju Goud
|

Updated on: Dec 10, 2020 | 8:42 AM

Share

మహిళల రక్షణకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన కీచకులు రెచ్చిపోతూనే ఉన్నారు. నిత్యం దేశవ్యాప్తంగా ఏదో చోట అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కఠిన చట్టాలు తీసుకువస్తేనే గానీ ప్రయోజనం ఉండదని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు కీలక తీర్పును వెలువరించింది. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడిని దోషిగా తేల్చి 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ పరిధిలోని యూసఫ్‌గూడలో 2018 మే27న నాలుగేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. షాపులో తినుబండారాలు కొనుక్కోవడానికి వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి అపహారించుకువెళ్లాడు. ఆ తర్వాతి నిందితుడు చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు. దీంతో నిందిడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్లు, పోక్సో చట్టం కింద కేసులు పెట్టారు. ఈ మైనర్ అత్యాచారినికి సంబంధించిన కేసుపై నాంపల్లి స్పెషల్ కోర్టు రోజువారీ విచారణ జరిపింది. విచారణ అనంతరం బుధవారం నిందితుడిని దోషిగా తేల్చిన కోర్టు.. 20 ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్షతోపాటు 12వేల జరిమానా విధించింది. ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలు, బాధితురాలి వాంగ్మూలం కీలక పాత్ర పోషించాయని పోలీసులు వెల్లడించారు. నిందితుడికి శిక్ష విధించడంతో.. దేశంలోని పోలీసులు, కోర్టులన్నీ ఇలాగే పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి