
Police seized illegal liquor bottles : ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అక్రమ మద్యం, నాటు సారా అమ్మకం దారులపై ఉక్కుపాదం మోపారు. ఇవాళ జరిపిన వరుస దాడుల్లో పలువురిని అరెస్ట్ చేసి అక్రమ మద్యం, నాటు సారా తయారీ దారులపై దాడులు చేసి కేసులు నమోదు చేశారు. కొత్తపేట ఎస్ఐ శ్రీను నాయక్ నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించారు. ఈ ఉదయం 6.30 గంటలకు కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని గంటి చెక్ పోస్ట్ వద్ద మద్యం అమ్ముతున్న పెనుగొండ మండలం రామన్నపాలెంకు చెందిన చింతపల్లి సురేష్ కుమార్ s/o సూర్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 53 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని సురేష్ పై కేసు నమోదు చేసి కోర్ట్ కు తరలించారు. మరొక కేసు లో ఈరోజు ఉదయం 9 గంటలకు పెదగుళ్లపాలెంలో నాటు సారా కాస్తున్న ధునబోయిన సత్యనారాయణ అనే వ్యక్తిపై శ్రీనివాస్ నాయక్ అతని సిబ్బంది దాడులు నిర్వహించారు. సత్యనారాయణ వద్ద నుండి 10 లీటర్లు నాటుసారా, ఇంకా తయారీ సామాగ్రి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి కోర్ట్ కు తరలించారు.
Read also : HPCL : విశాఖపట్నం హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో భారీ అగ్నిప్రమాదం, పరుగులు తీసిన జనం