Ambani Bomb Scare Case: అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు.. NIA దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు

|

Sep 11, 2021 | 11:34 AM

Ambani Bomb Scare Case: ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిపివేత కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Ambani Bomb Scare Case: అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు.. NIA దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు
Param Bir Singh
Follow us on

Ambani Bomb Scare Case: ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిపివేత కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) 10వేల పేజీలతో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో సస్పెండ్‌కు గురైన పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజేనే కీలక సూత్రధారి అని ఎన్‌ఐఏ పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ముంబయి మాజీ కమిషనర్‌ పరమ్‌ బీర్‌ సింగ్‌ గురించి కూడా కీలక విషయాలు బయటికొచ్చాయి. ఈ కేసులో పరమ్‌ బీర్‌.. బాలాజీ కుర్‌కురే పేరుతో నిందితులతో మాట్లాడినట్లు తెలిసింది.

అంబానీకి బెదిరింపుల కేసులు, వ్యాపారి మన్‌సుఖ్‌ హీరేన్‌ హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ.. ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజే సహా పలువురు నిందితులను అరెస్టు చేసింది. ఆ తర్వాత ఈ నిందితులతో ఎవరెవరు రహస్య చర్చలు చేశారన్న దానిపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే ‘బాలాజీ కుర్‌కురే’ అనే ఫేస్‌టైం ఐడీ పేరు బయటికొచ్చింది. ఈ ఐడీతోనే ముంబయికి చెందిన ఓ అనుమానిత వ్యక్తి నిందితులతో రహస్యంగా చాట్‌ చేసినట్లు తెలిసింది. దీంతో ఎన్‌ఐఏ కూపీ లాగకా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫేస్‌టైం ఐడీని ముంబయి మాజీ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ ఉపయోగించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎన్‌ఐఏ పేర్కొంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో పరమ్‌బీర్‌ ఓ కొత్త ఫోన్‌ కొనుగోలు చేశారు. ఆ ఫోన్‌ ఇవ్వడానికి పరమ్‌బీర్‌ ఆఫీస్‌కు వచ్చిన వ్యక్తి అందులో ఫేస్‌టైంని యాక్టివేట్‌ చేశారు. ఐడీ పేరు ఏం పెట్టాలా అని చూస్తున్న సమయంలో అక్కడే టేబుల్‌పై ఉన్న బాలాజీ కుర్‌కురే ప్యాకెట్‌ను చూశాడు. దీంతో ఆ పేరుతోనే ఐడీని క్రియేట్‌ చేసినట్లు ఓ ఇంటెలిజెన్స్‌ అధికారి చెప్పారని ఎన్‌ఐఏ వెల్లడించింది. ఈ ఫేస్‌టైం ఐడీతోనే పరమ్‌బీర్‌.. సచిన్‌ వాజే సహా పలువురు నిందితులతో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలిందని ఎన్‌ఐఏ తన ఛార్జ్‌షీట్‌లో తెలిపింది.

Also Read..

సైదాబాద్ బాలికపై అత్యాచారం, హత్య ఘటన.. పోలీసుల అదుపులో నిందితుడు..

Tirupati: తిరుపతిలో నాగుపాములు హల్‌చల్‌.. జనాన్ని పరుగులు పెట్టించిన పాములు