కళ్లు మూసుకుపోయిన కామాంధులు.. చిన్నారులను సైతం వదలడం లేదు. తాజాగా.. చిత్తూరులో మరో దారుణం వెలుగు చూసింది. పెళ్లికి వచ్చిన చిన్నారులను సైతం కన్నేస్తున్నారు మానవ మృగాళ్లు. ఒకపక్క చిన్నారులపై ఇన్ని ఘోరాలు జరుగుతోన్నా.. వాటిపై అవగాహన కల్పిస్తున్నా.. కూడా.. చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు.
తాజాగా.. చిత్తూరు జిల్లాలోని కురబల కోటలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. రాత్రి పెళ్లి ఫంక్షన్‌కి వచ్చిన చిన్నారి సడన్‌గా అదృశ్యమైంది. ఉదయం స్థానికంగా ఉన్న ఎన్నార్ ఫంక్షన్ హాల్ వద్ద చిన్నారి మృతదేహం లభ్యమైంది. దీంతో.. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. అయితే.. చిన్నారి పరిస్థితిని గమనించిన పోలీసులు.. చిన్నారిపై ఎవరో అత్యాచారం చేసి.. హత్య చేసి ఉంటారని అనుమానిస్తోన్నారు పోలీసులు.