ఓటుకు నోటు కేసులో విచారణ వాయిదా

నాలుగేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో విచారణ మరోమారు వాయిదా పడింది. ఈ కేసుపై మార్చి 17న విచారణ చేపట్టిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణను...

ఓటుకు నోటు కేసులో విచారణ వాయిదా
Jyothi Gadda

|

Mar 17, 2020 | 12:39 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో విచారణ మరోమారు వాయిదా పడింది. ఈ కేసుపై మార్చి 17న విచారణ చేపట్టిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. ఈ కేసులో ఏ-1గా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉండటంతో ఆయనను ఏసీబీ కోర్టులో హాజరుపర్చలేదు. మిగతా నిందితులు సెబాస్టియన్, ఉదయ సింహ కోర్టులో హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ.. మొత్తం 960 పేజీలతో చార్జిషీట్‌ దాఖలు చేసింది. అందులో ఈ కేసులో నిందితుల పాత్ర, అసలు సూత్రధారుల సంబంధించి కీలక విషయాలను అధికారులు వివరించారు.

కేసులో నిందితుల పాత్ర, అసలు సూత్రధారులకు సంబంధించి కీలక విషయాలను చార్జిషీట్‌లో పొందుపరిచింది. ఈ కేసుకు సంబంధించిన ఆడియో టేపుల FSL రిపోర్టు సైతం కోర్టుకు చేరింది. ఈ కేసులో స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి ఇవ్వజూపిన డబ్బు ఎక్కడినుంచి వచ్చిందనేది కీలకం కానున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 2015లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ముఖ్య అనుచరుడు వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతున్నారనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu