Security Guard arrested: నిర్భయ లాంటి చట్టాలొచ్చినా దేశంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ వృద్ధురాలిపై 25 ఏళ్ల సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రాలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. మానసికంగా బాధపడుతున్న 65 ఏళ్ల వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. యువకుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు థానే పోలీసులు తెలిపారు. థానె నగరంలోని నౌపడలోని హౌసింగ్ సొసైటీలో ఓ యువకుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అదే సొసైటీలోని ఒక ఇంట్లో మానసిక రుగ్మతతో బాధపడుతున్న వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. అప్పుడప్పుడు ఆమె బంధువులు తనని చూడటానికి వచ్చిపోతూ ఉంటారు. ఇదంతా గమనించిన ఆ యువకుడు నవంబర్ 3న మంచినీళ్ల ఇవ్వాలంటూ వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లాడు.
అనంతరం ఆమె నీళ్లు తీసుకుని వచ్చేలోపు.. తలుపులు వేసి ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆమె బాధపడుతూ ఇంట్లోనే ఉంది. గమనించిన పొరుగువారు ఆమె కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఆ తర్వాత వృద్ధురాలని డాక్టర్ దగరకు తీసుకెళ్లగా అసలు నిజం బయటపడింది. దీంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సెక్యూరిటీ గార్డుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఈ దారుణానికి పాల్పడినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: