చిన్నారి ప్రాణాల మీదకొచ్చిన తల్లిదండ్రుల మధ్య గొడవ.. కన్నబిడ్డను మేడ పైనుంచి విసిరేసిన తల్లి

|

Aug 08, 2021 | 7:20 AM

Vizianagaram: భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. అది కాస్త పెద్దదిగా మారి ఘర్షణ వరకూ దారితీసింది. ఈ క్రమంలో భార్య దారుణంగా

చిన్నారి ప్రాణాల మీదకొచ్చిన తల్లిదండ్రుల మధ్య గొడవ.. కన్నబిడ్డను మేడ పైనుంచి విసిరేసిన తల్లి
Vizianagaram
Follow us on

Vizianagaram: భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. అది కాస్త పెద్దదిగా మారి ఘర్షణ వరకూ దారితీసింది. ఈ క్రమంలో భార్య దారుణంగా ప్రవర్తించింది. భర్తపై కోపంతో కూతురును మేడపై నుంచి పడేసింది. ప్రస్తుతం కూతురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. జిల్లాలోని బొబ్బిలి గొల్లపల్లికి చెందిన దంపతులకు కొన్నెళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఈ క్రమంలో భార్య భర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థలు తలెత్తాయి.

శనివారం మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య తీవ్రంగా వాగ్వాదం జరిగింది. అనంతరం భార్య చిన్న కూతురితో మేడపైకి వెళ్లి.. అక్కడి నుంచి కిందకు విసిరేసింది. చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భర్త ఫిర్యాదు మేరకు భార్యపై కేసు నమోదు చేశారు. అనంతరం నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Gupta Nidhulu: ధనవంతులుగా మారండి.. ఆ గుప్తనిధులు మీ సొంతం కావచ్చు.. మాటల మాంత్రికులకు మోత మొగింది..

Sithanagaram Gang Rape Case: సీతానగరం గ్యాంగ్ రేప్ కేసులో మీడియా ముందుకు నిందితులు.. ఈ కర్కోటకుల క్రైమ్స్ తెలిస్తే దడే