Uttar Pradesh: గేదె తప్పిపోయిందని తీవ్ర మనస్తాపం.. ఉరేసుకుని బాలిక సూసైడ్..

|

Jul 26, 2022 | 6:58 PM

ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం సాధారణమే. కొందరు కుక్కలు, పిల్లులను పెంచుకుంటే మరికొందరు మాత్రం ఆదాయం కోసం కూడా జీవులను పెంచుకుంటారు. ఇలాంటి వాటిలో గేదెలు,ఆవులు, గొర్రెలు, మేకలు ఉంటాయి. వీటికి ఆ ఇంటి...

Uttar Pradesh: గేదె తప్పిపోయిందని తీవ్ర మనస్తాపం.. ఉరేసుకుని బాలిక సూసైడ్..
Suicide For Bufalo Up
Follow us on

ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం సాధారణమే. కొందరు కుక్కలు, పిల్లులను పెంచుకుంటే మరికొందరు మాత్రం ఆదాయం కోసం కూడా జీవులను పెంచుకుంటారు. ఇలాంటి వాటిలో గేదెలు,ఆవులు, గొర్రెలు, మేకలు ఉంటాయి. వీటికి ఆ ఇంటి కుటుంబసభ్యుల మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ అనుబంధం వీడి ఉండలేనంతగా మారితే.. ఆఖరికి ప్రాణాలే బలికోరితే.. తాజాగా ఉత్తరప్రదేశ్ లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. గేదెలతో అనుబంధం పెంచుకున్న ఓ బాలిక ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. గేదె కనిపించకుండా పోవడంతో ఆమె ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) జలౌన్ జిల్లా కురోనా గ్రామంలో ఓ కుటుంబం నివాసముంటోంది. వారు గేదెలను పెంచుకుంటూ, అవి ఇచ్చే పాలను అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆ కుటుంబంలో మూడు గేదెలు ఉన్నాయి. వాటిని ఆ ఇంట్లో ఉండే ఓ బాలిక చూసుకునేది. మేతకు తీసుకెళ్లడం దగ్గరి నుంచి వాటికి అవసరమైన అన్ని పనులను దగ్గరుండి చూసుకునేది. ఈ క్రమంలో బాలికకు గేదెలతో అనుబంధం ఏర్పడింది.

కొన్ని రోజుల క్రితం ఆమె గేదెలను మేతకు తోలుకెళ్లింది. ఆ సమయంలో ఒక గేదె తప్పిపోయింది. కేవలం రెండు మాత్రమే ఇంటికి చేరుకోగా.. మూడోది రాలేదు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు గేదె ఆచూకీ కోసం బాగా శ్రమించారు. పోలీసులకూ కంప్లైంట్ అచిచారు. అయినా లాభం లేకపోవడంతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో వారితో మాట్లాడటం మానేసింది. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు బాలికను ఝాన్సీలోని ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పడంతో బావురుమన్నారు. కాగా.. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి