Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం.. మరో ఎనిమిది మందికి..

Bus Accident: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బస్సులు ఢీకొని ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ సంఘటన రాష్ట్రంలోని

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం.. మరో ఎనిమిది మందికి..
Road Accident

Updated on: Jul 19, 2021 | 9:21 AM

Bus Accident: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బస్సులు ఢీకొని ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ సంఘటన రాష్ట్రంలోని సంభాల్​ జిల్లాలో చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఆగ్రా- చందౌసీ రహదారిపై బాహ్​జోయ్​ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఓ వివాహ వేడుకకు హాజరైన తిరిగి ఓ ప్రైవేట్​బస్సులో వస్తుండగా.. టైరు పంక్చర్ అయింది. దీంతో లహరావన్​గ్రామం బస్సును నిలిపి ఉంచారు. ఇదే క్రమంలో అటుగా వస్తున్న మరో బస్సు.. ఆగి ఉన్న బస్సును ఢీకొందని సంభాల్ జిల్లా ఎస్పీ చక్రేశ్ మిశ్రా వెల్లడించారు. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

Also Read:

Cloudburst: పోటెత్తిన వరదలు.. కుప్పకూలిన ఇళ్లు.. ముగ్గురు మృతి, నలుగురు గల్లంతు..

Selfie: ‘రూ.100 ఇస్తేనే సెల్ఫీ.. లేకపోతే నో’.. అభిమానులకు షాకిచ్చిన బీజేపీ మహిళా మంత్రి