Plane Crash: పెరూలో కుప్పకూలిన విమానం.. ఎడారి సందర్శనకు వెళ్లిన ఏడుగురి దుర్మరణం..

|

Feb 05, 2022 | 2:06 PM

పెరూ(Peru)లో ఘోర విమాన ప్రమాదం(Plane Crash) సంభవించింది. ఓ తేలికపాటి విమానం నాజ్కాలోలో టేకాఫ్‌ అయిన కొద్దిసేటికే కుప్పకూలింది.  దీంతో విమానంలో ప్రయాణిస్తోన్న ఏడుగురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.

Plane Crash: పెరూలో కుప్పకూలిన విమానం.. ఎడారి సందర్శనకు వెళ్లిన ఏడుగురి దుర్మరణం..
Follow us on

పెరూ(Peru)లో ఘోర విమాన ప్రమాదం(Plane Crash) సంభవించింది. ఓ తేలికపాటి విమానం నాజ్కాలోలో టేకాఫ్‌ అయిన కొద్దిసేటికే కుప్పకూలింది.  దీంతో విమానంలో ప్రయాణిస్తోన్న ఏడుగురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల (Nazca lines) పర్యటన కోసం సందర్శకులను తీసుకువెళ్తుండగా నాజ్కాలోని విమానాశ్రయం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఐదురగురు పర్యాటకులు, పైలట్​, కో-పైలట్ ఉన్నట్లు తెలిపారు. పర్యాటకుల్లో ముగ్గురు డచ్ టూరిస్టులు కాగా ఇద్దరు చిలీకి చెందినవారు. ఇక ప్రమాదానికి గురైన విమానం ఏరో శాంటోస్‌ అనే పర్యాటక సంస్థకు చెందిన సెస్నా 207 సింగిల్ ఇంజన్ విమానంగా అధికారులు గుర్తించారు.

దర్యాప్తునకు ఆదేశం..

కాగా పెరూలోని నాజ్కా లైన్లు అనేది ప్రముఖ పర్యాటక ప్రాంతం. యునెస్కో కూడా దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ ఎడారిని సందర్శించడానికి నిత్యం విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వీరికోసం మారియా రీచే ఎయిర్‌ ఫీల్డ్‌ నుంచి ప్రతిరోజు డజన్ల సంఖ్యలో విమానాలను నడుపుతుంటారు. కాగా 2010 అక్టోబర్‌లో ఇదే ప్రాంతంలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో నలుగురు బ్రిటిష్‌ పర్యాటకులు, ఇద్దరు పెరూవియన్‌ విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కాగా తేలికపాటి విమానం టేకాఫ్‌ అయిన కొద్ద సమయానికే కుప్పకూలిపోవడంపై దర్యాప్తునకు ఆదేశించింది పెరూ ప్రభుత్వం.

Also Read:Justin Prabhakaran: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న రాధేశ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్.. భామా కలాపం కోసం జస్టిన్ ప్రభాకరన్..

Nandamuri Balakrishna: సీఎం జగన్‌ను కలుస్తా.. మరోసారి ఎమ్మెల్యే బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు