RGI Airport Hyderabad: బంగారం, వెండి స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ.. అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. సినీ ఫక్కీలో స్మగ్లర్లు రోజుకో కొత్త దారిలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ చిక్కుతున్నారు. తాజాగా హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున బంగారాన్ని పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారుల దాడిలో ఆరు కేజీల బంగారం పట్టుబడింది. ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడటం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొంటున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు నిఘా వేశారు. దుబాయ్ నుంచి ఈకే524 విమానంలో శంషాబాద్ వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆరు కిలోల బంగారంతో పట్టుబడ్డారు.
కాగా.. ఈ బంగారాన్ని ఎమర్జెన్సీ లైట్‌లో పెట్టి తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిసతున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.2.90 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పక్కా సమారంతో.. తనిఖీలు చేపట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
Also Read: