లోయలో పడిన బస్సు.. ఆరుగురు మృతి..!

| Edited By:

Jun 25, 2019 | 8:55 AM

కుల్లు బస్సు ప్రమాదం ఘటన మరువకముందే.. జార్ఖండ్‌లోని గర్హ్వాలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గర్హ్వా నుంచి జార్ఖండ్ వెళుతున్న బస్సు తెల్లవారుజామున ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆంబులెన్స్ సహాయంతో గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికీ […]

లోయలో పడిన బస్సు.. ఆరుగురు మృతి..!
Follow us on

కుల్లు బస్సు ప్రమాదం ఘటన మరువకముందే.. జార్ఖండ్‌లోని గర్హ్వాలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గర్హ్వా నుంచి జార్ఖండ్ వెళుతున్న బస్సు తెల్లవారుజామున ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆంబులెన్స్ సహాయంతో గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికీ బస్సులో ఇంకా 12 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.