Accident in Bihar’s Araria: బీహార్‌లోని అరారియాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ఆటోను ట్రక్కు ఢీకొట్టిన సంఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం.. సోమవారం ఉదయం అరారియా వద్ద చోటుచేసుకుంది. అరారియా ప్రధాన రహదారిపై ఆటో వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢికొట్టిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కాగా.. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అరారియా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
10 మంది ప్రయాణికులతో పూర్నియా నుంచి వెళ్తున్న ఆటోరిక్షా అరారియా వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. కాగా.. ఈ ప్రమాదం అనంతరం డ్రైవర్.. ట్రక్కుతో సహా పరారయ్యాడని పోలీసులు తెలిపారు. లారీ, డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు అరారియా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పుష్కర్ కుమార్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా బధాడాలో సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఓ టక్కు రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దీంతో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కన గుడిసెలో కుటుంబసభ్యులంతా నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read: