Road Accident: విషాదం.. పెళ్లి చూపులకు వెళ్లొస్తుండగా ఎదురొచ్చిన మృత్యువు.. ముగ్గురు మృతి..

West Godavari Accident: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లి చూపులకు వెళ్లి వస్తూ యువకుడితోపాటు మరో ఇద్దరు

Road Accident: విషాదం.. పెళ్లి చూపులకు వెళ్లొస్తుండగా ఎదురొచ్చిన మృత్యువు.. ముగ్గురు మృతి..

Updated on: Oct 11, 2021 | 7:58 AM

West Godavari Accident: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లి చూపులకు వెళ్లి వస్తూ యువకుడితోపాటు మరో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన బేతా సూరిబాబు (26) పెళ్లిచూపుల కోసం.. బంధువులతో కలిసి కారులో రాజమహేంద్రవరం వెళ్లారు. ఈ కార్యక్రమం పూర్తయిన అనంతరం కారులో తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో వారంతా ప్రయాణిస్తున్న కారు అనంతపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది.

కారు వేగంగా ఢికొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. బేతా గోవిందరావు(65), భీమడోలు మండలం కొండ్రుపాడుకు చెందిన కారు డ్రైవరు జక్కుల శివాజీ (28) అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. తీవ్ర గాయాలైన సూరిబాబును ఏలూరు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే.. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Crime News: ఇలా ఎందుకు చేశావమ్మ..? ఇద్దరు పిల్లలను చంపిన కన్నతల్లి.. ఉరి వేసి దారుణంగా..

Dussehra 2021: ఇదేం పాడుపని.. ఉత్సవాల పేరుతో దుర్గమ్మ ఆలయం ముందు అశ్లీల నృత్యాలు..