Family Members Suicide: హైదరాబాద్‌లోని పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. చంద్రకాపురంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు ఇద్దరు సోదరులు, సోదరిగా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే వారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
అలాగే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడటంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో వారి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు